కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ నెల 16, 17, 18 మూడు రోజులపాటు రాత్రిపూట షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆకర్షింప చేశాయి. ప్రతిరోజు రాత్రి వేళల్లో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ వీక్షించడానికి మండల కేంద్రంలోని వందలాది మంది యువకులు హాజరయ్యారు. మూడు రోజులు జరిగిన ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా నవదుర్గ గణేష్ మండలి టీం గెలుపొందింది. రెండవ బహుమతిగా వెంకటేశ్వర గణేష్ మండలి టీం గెలుచుకుంది. గెలుపొందిన జట్లకు గ్రామ పెద్దలు ఆల్ పార్టీల నాయకులు పాల్గొని బహుమతులను అందజేశారు. రాత్రి వేళల్లో షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు గ్రామ పెద్దలు యువకులు అభినందించారు. ఈ ముగింపు కార్యక్రమంలో డాక్టర్ బండి వార్ విజయ్ చౌలవార్ హనుమాన్లు స్వామి రమేష్ కృష్ణ పటేల్ అజయ్ తమ్మే వార్ నాగేష్ సక్కర్ల వార్ తదితరులతో పాటు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.