Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మహిళలు వ్యాపారస్తులుగా మారాలి

మహిళలు వ్యాపారస్తులుగా మారేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని కోదాడ శాసన సభ్యురాలు యన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.శుక్రవారం కోదాడ లోని మేళ్లచెర్వు కాశినాథమ్ పంక్షన్ హాల్ నందు జరిగిన కోదాడ నియోజకవర్గం లోని 6 మండలాల మహిళా సమాఖ్య సభ్యులతో ఇందిరా మహిళ శక్తి సంబరాలు -2025 లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి కోదాడ ఎమ్మెల్యే యన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎవరి మీద ఆధార పడకుండా స్వయంగా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఎస్ హెచ్ జి ల ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తుందని తెలిపారు. ఎస్ హెచ్ జి ల ద్వారా టైలరింగ్, డైరీ పారం, కోళ్ల ఫారం,ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్స్, బస్సు లు, బ్యూటీ పార్లర్,మిల్క్ పార్లర్, ఫిష్ మొబైల్స్ వాహనాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటివి ఏర్పాటు చేసుకొనేందుకు రుణం అందించి స్వయంగా ఆర్థికంగా మహిళలు బలోపేతం కావాలని తెలిపారు.త్వరలో గోదాం లు,మునగాలలో మహిళలకి పెట్రోల్ బంక్ , అనంతగిరి మండలం శాంతి నగర్ లో అలాగే మునగాల మండలం రేపాల గ్రామంలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని వీటి ద్వారా మహిళలు వ్యాపారం చేసి కోటీశ్వరులుగా మారాలని ఆకాక్షించారు.స్త్రీ నిధి ద్వారా లోన్ తీసుకున్న గొండ్రియా ల గ్రామ లబ్ధిదారులతో ఎమ్మెల్యే ఎంత ఆదాయం వస్తుందని అడగగా 92000 లోన్ తీసుకొని రెండు గేదెలు తీసుకొని ప్రతి నెల 9000 రూపాయలు ఆదాయం వస్తుందని రేణుక తెలిపారు.ప్రభుత్వ విద్యార్థులకి యూనిఫారం లు కుట్టినందుకు 1,78,000 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు.

తదుపరి మహిళలకి ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించాలని అలాగే ఎ వ్యాపారం ద్వారా ఎంత ఆదాయం వస్తుందో మహిళలకి తెలియజేయాలనీ అలాగే వ్యాపార శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

కోదాడ నియోజకవర్గం లో 5050 సంఘాలలో 51900 మంది సభ్యులు ఉన్నారని అలాగే మిగిలిన మహిళలు తప్పకుండా ఎస్ హెచ్ జి లో చేరాలని సూచించారు.ప్రభుత్వం మీ ఆలోచనలకి అనుగుణంగా వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం పెట్టుబడికి ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రతి మహిళ 20,000 రూపాయలు నెలకి సంపాదించి మహిళా సాధికారత సాధించాలని ఆకాక్షించారు.తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. కొత్తగా ఎంపిక అయినా మహిళా సంఘ అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో కొన్ని తప్పులు జరిగాయని మరలా వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలని కొత్త అధ్యక్షులకి సూచించారు. ప్రభుత్వం మహిళా సంఘాలకి పెట్టుబడి సహాయం అందిస్తుందని మీరు మంచి ఆలోచనతో ఎ వ్యాపారం చేస్తే అధిక లాభాలు వస్తాయో ఎంపిక చేసుకొని వస్తే మీకు పెట్టుబడి సహాయం అందజేస్తామని తెలిపారు.

ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు కి 64 లక్షల సహాయం అందిస్తామని దీని ద్వారా గ్రామాల నుండి ప్లాస్టిక్ సేకరించి కేటగిరిలావారీగా విభజించి రి సైకిలింగ్ చేసి వ్యాపారస్తులకి అమ్మాలని సూచించారు. గతంలో పెద్ద పెద్ద వారు పెట్రోల్ బంక్ లు నడిపారని త్వరలో మా మహిళచే 1.20 కోట్ల రూపాయలతో పెట్రోల్ బంక్ , 15 లక్షలచే ధాన్యం భద్రపర్చుటకి గోదాం లు నిర్మాణం, సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు కి పెట్టుబడి సహాయం అందజేస్తామని తెలిపారు. సమాజంలో స్థిరమైన మార్పు మహిళల ద్వారానే సాధ్యం అవుతుందని తెలిపారు.ప్రతి నెల సంఘం సభ్యులు మీటింగ్ లు నిర్వహించాలని, అలాగే మండల సమాఖ్య మీటింగ్ లకి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు హాజరు అయి తమ సమస్యలు తెలియజేయాలనీ సూచించారు.రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో రూపాయి సేవ్ చేయాలన్నా అంటే కష్టం అని తెలిపారు.గతంలో బ్యాంకు రుణాలు తీసుకొని పిల్లల ఫిజ్ లు, ఇంట్లో అవసరాలు, అప్పులు తీర్చారు అని ఇప్పటి నుండి అలా చేయరాదు అని మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఎంబ్రయిడరి మగ్గం వర్క్, టైలరింగ్,పచ్చళ్ళ తయారీ లాంటి వ్యాపారం ఎంచుకొని భయపడకుండా, ధైర్యంగా ఉండి, నమ్మకం తో వ్యాపారం చేసి లాభాల బాట పట్టాలని సూచించారు.సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం తో 10,700 మంది నూతనంగా అడ్మిషన్ తీసుకున్నారని టీచర్లతో పాటు తల్లిదండ్రులు కుడా శ్రద్ద పెట్టాలని తెలిపారు. మహిళలకి ఐరన్ లోపం తో బలహీనంగా ఉంటున్నారని బలంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుంది కాబట్టి మంచి పోషకాహారం తీసుకోవాలని అంగన్వాడీ ల ద్వార అందిస్తున్నామని సూచించారు.వచ్చే సంవత్సరం నాటికి ప్రతి మహిళా వ్యాపారస్తులుగా మారాలని సూచించారు.

తదుపరి కోదాడ నియోజకవర్గం లోని బ్యాంకు లింకేజి ద్వారా 232 మహిళా సంఘాలకి 32.06 కోట్లు,3862 మహిళా స్వయం సంఘాలకి బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ కింద 12,99,07,000 చెక్ ని సభలకి అందజేశారు.ఈ సమావేశంలో ది ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ,ఇందిరా మహిళా శక్తి డైరెక్టర్ సునీత,ఎ పి డి సురేష్, ఎ పి యమ్ లు,మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

నిరాధార నిందలు వేసినా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరు

TNR NEWS

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

Harish Hs

అమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం  విద్యార్థు బావి భారత నిర్మాతలు : హెడమాస్టర్ వెంకటేశ్వర్లు 

TNR NEWS