Tnrnews.in
తెలంగాణ

కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దుచెయ్యాలి. 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి..     సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు..

 

హత్నూర మండల గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం దౌల్తాబాద్ లో జరిగింది.ఆదివారం సమావేశంలో జి సాయిలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుండి గ్రామాన్ని శుభ్రంగా తయారు చేస్తున్న నేటికీ కనీస వేతనం లేదన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గ్రామపంచాయతీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ప్రశ్నించారు గత పది సంవత్సరాలలో ఉన్న ప్రభుత్వం వేతనాల పెంచాలని అనేక సందర్భాలు అడిగిన వేతనాలు పెంచకుండా పని భారం పెంచిందని గత సమ్మె సందర్భంగా మేము అధికారులకు వస్తే వేతనాలు పెంచి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఊసు ఎత్తడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కనీస వేతనాలు చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో ఆరు నెలల నుండి వేతనాలు అందకుంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుడు ఎలా బతుకుతాడని ప్రశ్నించారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని లేనిచో ఎంపీడీవో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని రెగ్యులర్గా వేతనాలు చెల్లించాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు నాగభూషణం గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు శంకర్ ఎల్లయ్య వెంకటయ్య అశోక్ రాములు, బిక్షపతి నాగయ్య నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

TNR NEWS

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

కెనాల్ ఆయకట్టు గ్రామాలకు వెంటనే ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలి

Harish Hs

జనరల్ బాడీ తీర్మానం మేరకే క్లబ్ కొత్త భవనం బహిరంగ వేలం

TNR NEWS

కోదాడ రామాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి ప్రత్యేక పూజలు

TNR NEWS

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

Harish Hs