ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను,కుంటలను నింపాలని, ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మోతే మండల కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి సూర్యాపేట జిల్లా కు 2 లక్షల ఎకరాలు కి పైగా నీళ్ల ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామవరం పెద్ద చెరువును రిజర్వాయర్ గా చేయాలని కోరారు. ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేపట్టిచెరువులను, కుంటలను నింపాలని అన్నారు. రైతులు నార్లు పోసుకొని నాటు పెట్టడం కోసం సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరును విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు నార్లు పోసుకున్నప్పటికీ నాటు పెట్టడం కోసం నీరు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం తుంగతుర్తి, సూర్యపేట,కోదాడ ప్రాంతాలకి ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరు అందించి రైతులను ఆదుకోవాలని అన్నారు. వర్షాలు రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశతో ఉన్నందున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కంపాటి శ్రీను, జంపాల స్వరాజ్యం, కిన్నెర పోతయ్య, బానోతు లచ్చిరాం నాయక్, దోసపాటి శ్రీనివాస్, కక్కిరేణి సత్యనారాయణ, చర్లపల్లి మల్లయ్య, షేక్ జహీన బేగం తదితరులు పాల్గొన్నారు.

previous post
next post