నేరాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలి అని, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత పెద్దవారికి వివరించాలని మునగాల CI రామకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా మునగాల మండల మోడల్ పాఠశాల నందు మునగాల పోలీసు అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. కాన్ఫిడెంట్ బిల్డింగ్, మంచి అలవాట్ల పట్ల అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజ రక్షణలో యువకులు ముందుండాలని కోరారు, శాంతి యుత సమాజం కోసం పోలీసులు నిరంతర కృషి చేస్తున్నారు. యువత భాగస్వామ్యం కావాలని మంచి నడవడిక ఉండాలి నేటి యువతి దేశానికి రేపటి భవిష్యత్తు అన్నారు. ఇలాంటి యువతి చెడు వ్యసనాలకు గురి అయి శక్తిని నెరవేర్యం చేసుకోవద్దు అని కోరారు. ఈ కార్యక్రమంలో మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
