విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ లు ఎంతో దోహదపడుతుందని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పీఎం శ్రీ బాయ్స్ హై స్కూల్ నందు కోదాడ, హుజూర్నగర్ రెండు డివిజన్ల పరిధిలోని పీఎం శ్రీ పాఠశాలల సైన్సు మరియు గణిత ఉపాధ్యాయులు 36 మందికి రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమ ముగింపు సందర్భంగా వారి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు చక్కటి గుణాత్మక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలతో ల్యాబ్ ను ఏర్పాటు చేసింది అన్నారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ల్యాబ్ లు దోహదం చేస్తాయన్నారు.జిల్లా సైన్స్ అధికారి లామ్ దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్సు ఆసక్తిని పెంచి భావి భారత శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసిందన్నారు. రిసోర్స్ పర్సన్స్ కిషన్,ప్రశాంత్, రఘు లు రెండు రోజులపాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ, హుజూర్నగర్ సైన్స్,గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు………