శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో కోదాడ పట్టణానికి చెందిన శ్రీ స్కూల్ పాఠశాల విద్యార్థులు 20 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు డి నైనిక, నాలుగవ ర్యాంకు ఎండి అబ్దుల్ రెహమాన్, సిహెచ్ లిఖిల్ ప్రీతివ్ లు సాధించారు. జిల్లా స్థాయిలో జిల్లా మొదటి ర్యాంకు సాయి సూరజ్,రెండవ ర్యాంకు ఏ పూజ శ్రీ, మూడవ ర్యాంకు పి ఆశ్వాద్, ఎండి రిదా మెహన్ లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన సందర్భంగా విద్యార్థులు రవీంద్ర భారతి లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్ లాల్ లావిడియా చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.కాగా గురువారం పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ టి. నరేష్, కరస్పాండెంట్. వేదాంతరావు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు…………