కోదాడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం నందు కేసు వివరాలు వెల్లడించిన కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి. CI రామకృష్ణారెడ్డి మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు.
కేసు వివరాలు :
ఈ సంవత్సరం మార్చి నెల మరియు మే నెలలో మునగాల గ్రామ పరిధిలోని నాగార్జునసాగర్ కెనాల్ పై లిఫ్టుల కోసం అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫామర్ ల నుండి కాపర్ వైర్ దొంగతనం చేయడం జరిగిందని సంబంధిత అధికారులు రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై మునగాల స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. రైతులకు నష్టం జరగకుండా ఉండాలి నిందితులను అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నిరంతరం ఎన్ఎస్పీ కెనాల్ పై పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడం జరిగినది. కేసు దర్యాప్తులో ఉండగా ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారంపై బరాఖతగూడెం వద్ద నాగార్జునసాగర్ కెనాల్ పై అనుమానాస్పదంగా వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మునగాల ఎస్సై తన టీం తో కలిసి అక్కడికి వెళ్లి అక్కడ అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది. వీరిని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పట్టణానికి చెందిన పాలకుర్తి వెంకటరామయ్య వయసు 26 సంవత్సరాలు, గుంటకళ్ళ కాజేశ్వరరావు 27 సంవత్సరాలు, బోయపాటి అశోక్ కుమార్ 27 సంవత్సరాలు, దేవరకొండ ఇషాంక్ 29 సంవత్సరాలు, పరారీలో ఉన్న వ్యక్తి బలిగా శ్రీకాంత్ 28 సంవత్సరాలు గా గుర్తించడం జరిగినది. విచారించగా మునగాల, నడిగూడెం మండలాల పరిధిలో ఎన్ఎస్పీ కెనాల్ పై ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగతనం చేసినట్లు వర్తించడం జరిగినది. వీరు నుండి 2 లక్షల 50 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడు వెంకటరామయ్య గతంలో కాపర్ వైర్ దొంగతనాలు చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దొంగతనం చేసిన కాపర్ వైర్ ను ఒంగోలు నెల్లూరు తిరుపతి ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులకు ఫ్యాక్టరీ ఏజెంట్లకు కిలో రూ.400 చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించడం జరిగినది.
అరెస్ట్ చేయబడిన నిందితులు అందరూ స్నేహితులు. అంతా చెడు తిరుగుళ్ళు, దుర్వ్యసనాలు కు బానిస అయినారు, వీరందరికీ నేర చరిత్ర ఉన్నది. వీరంతా సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో పాలపర్తి వెంకట్రామయ్య కి గతం లో కాపర్ వైర్ లు దొంగతనం చేసి అమ్ముకునే చరిత్ర ఉన్న నేపధ్యంలో వీరంతా కలసి ఒంగోల్ సిటి నందు సెల్ఫ్ డ్రైవ్ పేరుతో గుర్తు తెలియని కార్ లను కిరాయికి తీసుకుని వచ్చి ఇక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల నుండి అర్ధరాత్రి వేళ ట్రాన్స్ఫార్మర్ టాప్ పైకి లేపి దానిలో గల కాపర్ వైర్ ను దొంగతనం చేసి ఒంగోల్, నెల్లూర్ మరియు తిరుపతి ఏరియాల యొక్క ఫ్యాక్టరీ లకు సంభందించిన గుర్తు తెలియని ఏజెంట్ కు కిలో ఒక్కింటికి రూ. 400/- చొప్పున అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ రైతుల లిఫ్ట్ లు డ్యామేజీ చేయటంతో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆస్తులకు నష్టం కలిగించారు. వీరంతా కలసి మొత్తం సుమారు (5) క్వింటళ్ల కాపర్ వైర్ ను దొంగతనం చేసినారు. వీరి అరెస్ట్ లో కీలకంగా వ్యవహరించిన Munagala CI D. Ramakrishna reddy, SI B. Praveen Kumar, SI, ID Party స్టాఫ్ రామారావు, కొండలు, అదే విధంగా సూర్యాపేట CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, SI Harikrishna, Yadavendra reddy, సిబ్బంది మల్లేశ్, శివ, ఆనంద్, శ్రీను లను కోదాడ DSP శ్రీ. M. శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించినారు.