అనంతగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహస్తున్న హెడ్ కానిస్టేబుల్ కందికొండ శ్రీను ఇటీవల అనంతగిరి- కోదాడ రహదారి మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై హెడ్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ పట్టణంలో మెరుగైన చికిత్స పొందుతున్న కందిబండ శీనుని టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతగిరి కోదాడ రహదారి మార్గమధ్యంలో యువత ద్విచక్ర వాహనాలను మితిమీరిన వేగంతో డ్రైవ్ చేస్తున్నారని ఇదే విషయమై పోలీసులు సైతం అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తారని తెలిపారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని ఒకవేళ ఆలా ఇస్తే కేసులు నమోదు చేసేందుకు పోలీసుల సైతం కఠిన చట్టాలను తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆయన వెంట ఎలకా నరేందర్ రెడ్డి ఈనాడు పుల్లయ్య ఉన్నారు.