Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

జయ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ నందు గల జయ స్కూల్ నందు భారత ప్రధమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం బాలల‌దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలో అలరించారు. తెలంగాణ తల్లి, దుర్గాదేవి, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, శివాజి, అల్లూరి సీతారామరాజు వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ మాట్లాడుతూ తమ పాఠశాల‌ యందు ప్రధమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా దేశభక్తిని చాటేవిధంగా చిన్నారుల వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల న్ర్రత్యాలు అలరించే విధంగా వున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ డైరెక్టర్ లు జల్లా పద్మ, బింగి జ్యోతి లు, పాఠశాల సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

Related posts

విమాన ప్రమాద మృతులకు నివాళులు

TNR NEWS

ప్రజలందరి దేవుడు అంబేద్కర్

TNR NEWS

*తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యం గా కుల గణన చేపట్టాం-ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*

TNR NEWS

కోదాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Harish Hs

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం

Harish Hs

బర్డ్ వాక్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించిన అటవీ శాఖ అధికారులు…  వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పక్షి ప్రేమిక పర్యా టకులు…

TNR NEWS