మహబూబాబాద్ జిల్లా :
తొర్రూర్ మండలం,అమ్మాపురం గ్రామ మహిళా రైతు బూరుగు సునిత ఉదయాన్నే తన పొలం లోని నారుమడిలో యాసంగి పంట కొరకు వరి మొలకలు చల్లడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ తాను యాసంగి పంటకు పనులు ప్రారంభించ్చినట్లు చెప్పింది….వానాకాలం పంట ధాన్యం కాంటపెట్టి చాలా రోజులవుతుంది. ఇంతవరకు తమ అకౌంట్లో బోనస్ డబ్బులు జామకాలేదని సునిత ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకం వడ్లకు మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తాం అని చెప్పింది, దొడ్డు వడ్లకు బోనస్ వర్తించదని రైతు కు నచ్చినట్లు పొలంలో వరినారు వేయడం కుదరట్లేదు అని వాపోయారు.కనీసానికి యాసంగి పంట ధాన్యం అయినా త్వరగా కొనుగోలు చేసి రైతుకు పంట బోనస్ వెంటనే వేయాలని ప్రభుత్వానికి సూచనలు చేయడం జరిగింది.