స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం అని బాబు నాయక్ స్వేరో అన్నారు. స్వేరోస్ నెట్వర్క్ లో భాగమైన స్వేరో కోర్ ను బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటన నిర్వహిస్తున్న బాబు నాయక్ స్వేరో తన పర్యటనలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లాకు రావడంతో స్వేరోస్ ఆయనను ఘనంగా ఆహ్వానించారు..ఈ సందర్భంగా కోదాడలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్వేరోకోర్ ఫౌండర్ బాబు నాయక్ స్వేరో పాల్గొని స్వేరోకోర్ అనేది స్వేరో కార్ప్స్ ఏర్పాటు చేయడంలో భాగంగా ఏర్పాటుచేసిన విభాగం అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతి యువకులను స్వేరో కార్ప్స్ లో చేర్చి వారిని మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవారిగా ఆరోగ్యం పై అవగాహన కల్పించే కమాండర్లుగా మలచడమే లక్ష్యమని స్వేరోస్ సిద్ధాంతమైన అక్షరం, ఆరోగ్యం, ఆర్థికంలో ఒక భాగమైన ఆరోగ్యం అనేదాన్ని సమాజంలో ఒక ముఖ్యమైన అవసరంగా ప్రచారం చేయడంలో ఇది పనిచేస్తుందని అలాగే బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మలచడంలో దీని పాత్ర ముఖ్యమని వివరించారు.ఈ సందర్భంగా సూర్యాపేట స్వేరోస్ బాబు నాయక్ స్వేరో ను ఘనంగా సత్కరించారు..ఈ సందర్భంగా కొండపల్లి మనీ ని స్వేరోకోర్ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి కిరణ్, సీనియర్ స్వేరో చడపకు రవికుమార్, బొల్లికొండ వీరస్వామి, చడపంగు నాగార్జున, విజయనిర్మల, జ్యోతి రాణి, వీరస్వామి,మందా వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు.