Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రతి ఒక్కరికీ మంచి ఆశయం,లక్ష్యం ఉండాలి

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా బుధవారం హుజుర్నగర్ పట్టణం నందు తెలంగాణ మైనారిటీ గల్స్ కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళల, విద్యార్థినిలు, బాలికల రక్షణ చట్టాలు గురించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమం నందు కోదాడ డివిజన్ DSP శ్రీదర్ రెడ్డి, CI చరమంధ రాజు, SI మోహన్ బాబు పాల్గొని మాట్లాడారు. జిల్లా పోలీస్ కళాబృందం పాల్గొని సామాజక అంశాలు, షి టీమ్స్, మంచి అలవాట్ల గురించి పాటలు పాడి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోదాడ DSP గారు మాట్లాడుతూ పాఠశాలలో మనం ఎందుకు ఉన్నాము అనేది గుర్తుంచుకోవాలి, చదువు చాలా విలువైనది ప్రపంచంలో చదువుతోనే విజ్ఞానం వెలుగోందుతుంది అన్నారు. మనకు విజ్ఞానాన్ని, తెలివిని పాఠశాల నేర్పిస్తుంది అని DSP అన్నారు. బాగా చదివి ప్రయోజకులు కావాలి, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. అవకాశాలు లేని రోజుల్లో మంచి విజయాలు సాదించిన గొప్పవాళ్ళు అన్నారు అలాంటి వారి విజయగధాలను ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు. బాలికలు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరాలని అన్నారు, సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి వాటి నిర్మూలనకు చదువు మార్గం అన్నారు. ప్రావీణ్యం ఉన్న అంశంలో కృషి చేయాలి, ఆటలు ఆడాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి అని కోరారు. భేటీ బచావో – భేటీ పడావో నినాదంతో బాలికల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, బాలికలను ఎదగనివ్వాలి అని DSP గారు అన్నారు. బాల్య వివాహాలు చేయవద్దు అని కోరారు. విద్యార్థులు చిన్నచిన్న సమస్యలకు ఒత్తిడికి లోనై, ఆకర్షణలకు లోనై బంగారు జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దు అని కోరారు. చెడు అలవాట్లకు లోను కావద్దు మంచి పుస్తకాలను మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి, కష్టపడి చదివి తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ఏ రకంగా నైనా వేధింపులు జరుగుతున్న తెలిసినవాళ్లు బంధువులు ఎవరైనా చెడు బుద్ధితో శరీరాన్ని తాకుతున్నట్లు గ్రహించిన వెంటనే తల్లిదండ్రులకు లేదా గురువులకు తెలియజేయాలి, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని అన్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాలు మాదకద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా ఉన్నాయని వీటిపై విద్యార్థులు ఫ్రంట్ వారియర్స్ లాగా పనిచేసే పెద్దలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే వాటికి ప్రభావితం కావొద్దు అని ఇంటర్నెట్ నుంచి జ్ఞాన సముపార్జనకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి  ఎస్సై విజయ్ కొండ

TNR NEWS

లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల మహాసభను విజయవంతం చేయాలి

TNR NEWS

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?

TNR NEWS

అంత్యక్రియలకు అడ్డుపడ్డారు.. సవరాలు బందు పెట్టాం… న్యాయం జరిగే వరకు శుభ,అశుభ కార్యాలకు దూరంగా ఉంటాం…

TNR NEWS

చట్టాలపై అవగాహనతో ఉజ్వల భవిష్యత్తు

Harish Hs

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

TNR NEWS