రాష్ట్రంలోని అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రశ్నించినందుకు BRS పార్టీ రాష్ట్ర నాయకులను అక్రమ అరెస్టులు చేయడం అధికార దుర్వినియోగము చేయడమే. ఎన్నికలలో అమలు కాని హామీలను ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నమ్మి గెలిపించిన ప్రజలను మోసం చేయడమేకాక… ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు మాకిచ్చిన అవకాశంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే BRS పార్టీ రాష్ట్ర నాయకులపై రకరకాల కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం అని BRS పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ గారు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక, పాలన చేతకాక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఈరోజు కోదాడ పట్టణంలో నిమ్మకాయల సెంటర్ దగ్గర డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం చేసిన అనంతం కోదాడ టౌన్ పోలీసువారు వచ్చి BRS నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కోదాడ టౌన్ స్టేషన్ కి తరలించారు. అరెస్టు అయిన వారిలో BRS పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, పార్టీ మహిళా నాయకురాలు పిట్టల భాగ్యమ్మ, పార్టీ నాయకులు కర్ల సుందర్ బాబు, చలిగంటి వెంకట్, జానీఆర్ట్స్, గొర్రె రాజేష్, కె.లక్ష్మణ్, షేక్ దస్తగిరి తదితరులు ఉన్నారు.