ద్వారకా తిరుమల న్యూస్: గోపాలపురం ఏ యమ్ సి కార్య వర్గ సమావేశం స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణం లో ఎ యమ్ సి చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు అధ్యక్షతన గురువారం ఉదయం జరిగింది.ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ నందు నిర్వహిస్తున్న నిమ్మకాయల క్రయ విక్రయాల కు సంబంధించిన పలు అంశాలు కమీషన్ వ్యాపారులు,మార్కెటింగ్ సిబ్బంది చేసిన అన్ని అంశాలను పరిశీలించి పలు తీర్మానాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక కృషితో మార్కెట్ యార్డ్ అన్ని వసతులతో అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా సత్యనారాయణ గారు,ఎం యమ్ సి వైస్ చైర్మన్ పోతన ధర్మరాజు, సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు కూనమపం ప్రసాద్,స్తానిక నిమ్మకాయ కమిషన్ వ్యాపారులు,ఎం యమ్ సి అధికారులు,మండల ఐ టి డి పి పార్టీ అధ్యక్షులు ఏపూరికిషోర్, మండల పార్టీ నాయకులు, నాదెళ్ల వెంకటేశ్వరరావు,యలమంచిలి బాబీ,ఘంట శ్రీనివాసరావు, పాకనాటి శేషు,జంగా కృష్ణమూర్తి, బోట్ల సాయి, తదితరులు పాల్గొన్నారు.

previous post
next post