సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ వ్యాపారవేత్త, యమ ప్రభాకర్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలభవన్ లో ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్లాస్టిక్ సముద్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. తద్వారా సముద్ర జీవులకు హాని కల్గిస్తున్నాయన్నారు. తాబేళ్లు, సీల్స్, పక్షులు, జంతువులు ప్లాస్టిక్ వ్యర్థాలలో చిక్కుకుని గాయాలు, మరణానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలు ప్లాస్టిక్ సంచులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను నిషేధించాయన్నారు.ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే రీసైకలింగ్ చేస్తున్నారన్నారు.చాలా వరకు ప్లాస్టిక్‌ను పూడ్చి పెట్టడం, కాల్చి వేయడం చేయాలన్నారు. ప్రతి ఏటా దాదాపు 8 మిలియన టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్లాస్టిక్ సంచి సగటున 12 నిమిషాలు ఉపయోగించబడుతుందన్నారు. కానీ కుళ్లిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందన్నారు. ప్రపం చ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1 మిలియన ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలవుతున్నాయన్నారు. 2050 నాటికి సముద్రంలో ప్లాస్టిక్ బరువు అన్ని చేపల బరువును మించి పోతుందన్నారు. బాధ్యత గల పౌరులు ఒక సారి ఉపయోగించే ప్లాస్టిక్‌లను తిరస్కరించాలని తెలిపారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ప్లాస్టిక్ వినియోగం పూర్తి గా తగ్గిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లిలకు, పుట్టినరోజు వేడుకలకు వచ్చిన వారికి చేతి సంచులను ఇవ్వడం వలన ఈ తరాన్ని, వచ్చే తరాన్ని కాపాడుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, బండి రాధాకృష్ణ రెడ్డి, వీరు నాయుడు, అరుంధతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post