రాబోయే గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దత పై అదనపు కలెక్టర్ లు జే.అరుణ శ్రీ, డి.వేణు లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.*జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* రాష్ట్రంలో పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని, ఎంపిడీఓ లు ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మండల స్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు,బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఎన్నికలు వస్తే చేయాల్సిన పనులను మండల పంచాయతీ అధికారి, ఎంపిడిఓ కలిసి లిస్ట్ ఔట్ చేసుకోవాలని,ప్రతి పనికి ఒక అధికారికి బాధ్యతలు అప్పగించాలని,అవసరమైన సిబ్బంది,మెటీరియల్ వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు.అసెంబ్లీ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,స్థానిక సంస్థ ఎన్నికలు వేరువేరుగా ఉంటాయని,స్థానికత పరిస్థితుల ఆధారంగా పోలింగ్ కేంద్రాలను విభజించాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రణాళికలు చేసుకోవాలని,ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్స్ ల తరలింపుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పరిశీలనకు అవసరమైన బృందాలు ఏర్పాటు చేసుకునే సన్నద్ధంగా ఉండాలని అన్నారు. అనంతరం జనవరి 29న మృతి చెందిన అంతర్గాం ఎంపీడీవో అలీముద్దీన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కలెక్టర్, ఎంపీడీవోలు,ఇతర అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సమావేశంలో డిపిఓ వీర బుచ్చయ్య, జడ్పీ సీఈవో నరేందర్, హౌసింగ్ ఈ ఈ రాజేశ్వర్,ఎన్నికల నోడల్ అధికారులు,డి ఎల్ పి ఓ లు, ఎంపీడీవో,ఎంపీవోలు సంబంధిత అధికారులు,తదితరులు పాల్గోన్నారు.