Tnrnews.in
తెలంగాణ

తెలంగాణ లో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం బిజెపి  బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మోతె:బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయిని,దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయంకోరేశక్తులు,ప్రజాస్వామికవాదులంతా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్దమైన చర్యలన్నీ తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా కేంద్ర ప్రభుత్వం స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్‌ చేసి గవర్నర్‌కు పంపించినాఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయని గుర్తు చేశారు. బీజేపీ కులతత్వ, మనువాద పార్టీ అయినందున, కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని విమర్శించారు. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నమూ తీయలేదని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో బిజేపి ఉండడం వల్లనే ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిరదని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తేనే సాధ్యం అవుతుందన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS

నేరాలకు పాల్పడితే జైలు తప్పదు, కుటుంబంలో ఒక్కరూ జైలుకు వెళితే కుటుంభం చిన్నాభిన్నం అవుతుంది.

TNR NEWS

ప్రతిష్టించిన చోటే గణేష్ ని నిమజ్జనం

TNR NEWS

మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు.  డిఎంహెచ్వో వెంకట రవణ  డాక్టర్ నిరోషా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి ఆదేశాల మేరకు.

TNR NEWS