హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని అంచనా వేస్తూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.
