విద్యార్థులు కనబడగానే ఉపాధ్యాయుడిగా మారిపోతారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం మండలం, రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
4, 5వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ఇంగ్లీష్, తెలుగు, గణితం పాఠాలు చెప్పారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించి, బోర్డు మీద గణిత లెక్కలు చేయించారు.
విద్యార్థుల సమాధానాలను ప్రశంశిస్తూ సంతోషంగా బహుమతులను అందజేశారు.
ఉపాధ్యాయులైన ధర్మయ్య, నీరజ, సుధారాణి, వెంకన్నలను వారి సత్కార్యానికి అభినందించారు.
“విద్యార్థుల ప్రతిభ ఉపాధ్యాయుల కృషిని ప్రతిబింబిస్తుంది. ఇలాగే బోధిస్తూ మంచి పేరు సంపాదించండి” అని సూచించారు.
ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితం, ఇంగ్లీషులో ప్రాథమిక పట్టు అవసరమని తెలిపారు.
ఎక్కడికైనా పర్యటనకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఒక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమవుతారు.
అభ్యసన సామర్థ్యాల పరిశీలనతోపాటు బాగా చదివే విద్యార్థులకు నాట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేసి ప్రోత్సహించారు.
జిల్లా కలెక్టర్ వెంట డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం రాము, తహసీల్దార్ శ్రీకాంత్, ఆరి శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు ధర్మయ్య మరియు ఉపాధ్యాయనీలు హాజరయ్యారు.
“చదువే అభివృద్ధికి మూలం” అనే విశ్వాసంతో విద్యా వాతావరణాన్ని బలోపేతం చేస్తున్నారు కలెక్టర్…
