మోతే: తెలుగు సంస్కృతి, సాంప్రదాయానికి సంక్రాంతి ముగ్గులు చిహ్నం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మోతే మండలం సిరికొండ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి ఆయన మాట్లాడుతూ మహిళల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహద పడతాయని అన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మహిళ కూలీల జిల్లా కన్వీనర్ జంపాల స్వరాజ్యం, నాయకులు నందిగామ కృష్ణారెడ్డి, నందిగామ రామిరెడ్డి, బాబు, బొడుపుల పుల్లయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య, మహిళా సంఘం నాయకురాలు మట్టి పెళ్లి నీలిమ, కటారి పార్వతమ్మ, సిపిఎం పార్టీ గ్రామ శాఖ నాయకులు జంపాల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

previous post