Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

 

వికారాబాద్ :

జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్మన్ కొండ విశ్వేశ్వర్ అధ్యక్షతన జరిగింది. దిశ వైస్ చైర్మన్ డి.కే.అరుణ , జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, చేవెళ్ల, తాండూర్ శాసన సభ్యులు కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ లతో కలిసి చైర్మన్ కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ శాఖలకు వచ్చే నిధులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిశ్వర్దపరంగా పనిచేస్తన్నారు. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన, పరిష్కార విషయాలను 3 మాసాలకు సమీక్షించుకోవలసిన అవసరం వుందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు స్వఛ్చ భారత్ కింద బాత్ రూమ్ లకు ప్రాధాన్యత కల్పిస్తూ కొత్త వాటికి ప్రతిపాదనలు ఇవ్వకుండా మరమ్మతులకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన సూచించారు. ఉజ్వల పథకంలో భాగంగా మున్సిపల్ పరిధిల్లోని పనులు చేపట్టాలని సూచించారు. పర్యాటక కేంద్ర అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇందులో భాగంగా అమృత్ పథకం కింద రైల్వే స్టేషన్ కు సంబంధించిన పనులకు కొంత నిదులను కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని చైర్మన్ సూచించారు.

కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు అదేవిధంగా ప్రతి బ్యాంక్ కు నిర్దేశించిన లక్ష్యాల వివరాలతో దిశ సమావేశానికి అధికారులు హాజరు కావాలని చైర్మన్ ఆదేశించారు. బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు.

బోర్లు వేసి వాటిని మూసివేయక పోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు నీరు పడకుండడంతో వదిలివేసిన బోర్లను వెంటనే పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్వచ్చ భారత్ కింద నిర్మాణాలు చేపట్టిన మరుగుదొడ్ల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ లను వివరాలు అడిగి తెలుకున్నారు.

అంగన్వాడీ కి

పక్కా భవనాలు వుండేలా చర్యలు తీసుకోవాలని దిశ వైస్ చైర్మన్ డి.కే.అరుణ సూచించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలని ఆమె తెలిపారు. పోషణ అభియాన్ కింద

అంగన్వాడీలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషక ఆహారంతో పాటు బాలామృతాని అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.

సమావేశంలో భాగంగా పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఉపాధి హామీ, విద్యుత్ , మిషన్ భగీరథ, జాతీయ రహదారులు, భూగర్భ జలాలు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సమావేశంలో డిఆర్డిఓ శ్రీనివాస్, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, నామినేటెడ్ సభ్యులు వడ్ల నందు, రాజశేఖర్, జానకిరామ్, లలిత, మున్సిపల్ కమిషనర్లు జాకీర్ అహ్మద్, వెంకటయ్య, విక్రమ సింహ్మ రెడ్డి , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి……

TNR NEWS

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS

తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయంలోకి సబ్ కోర్టు………

TNR NEWS

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ కమిటీ పని చేయాలి…

TNR NEWS