మంథని/పెద్దపల్లి:
మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో ఐ టి, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డిఎంఎచ్ఓ ప్రమోద్ కుమార్ సూచనల మేరకు, ప్రాజెక్ట్ ఐరన్ హెల్త్ చిల్డ్రన్ డెంటల్ మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ ఎన్ టి పి సి సహకారంతో హైదరాబాద్ రోహిణి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంపత్ రెడ్డి సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ప్రోగ్రాం మేనేజర్ సంగీత తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులకు రక్త పరీక్షలు దంత పరీక్షలు నిర్వహించారు రక్తంలో హిమగ్లోబిన్ శాతాన్ని పరీక్షించి రక్తం తక్కువగా ఉన్న విద్యార్థులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే దంత సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. కొంత మంది విద్యార్థులకు కొల్గేట్ పెస్ట్ అందించారు. అలాగే ఇటీవల బదిలీ పై, నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు, గేమ్స్ లో స్టేట్ లెవెల్ సెలక్ట్ అయిన విద్యార్థులకు, సెలక్ట్ అయిన విద్యార్థులను, స్టేట్ గేమ్స్ పిల్లలను న్యూస్ కవర్ చేసిన మీడియా మిత్రులకు వాతావరణంను దృష్టిలో పెట్టుకోని నేబులెజర్ అందించిన పేరెంట్స్ కమిటి ప్రధానకార్యదర్శి లను శాలువాలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ పాల్ శ్రీనాథ్, పి డి రమేశ్, పేరెంట్స్ కమిటి చైర్మన్, టి జి పి ఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట ఉపాధ్యక్షులు రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి దార మధు, పేరెంట్స్ కమిటి ప్రధానకార్యదర్శి ఐలి ప్రణీత్, ఉపాధ్యక్షులు కన్నూరి సదయ్య, మెట్టు సమ్మయ్య, కార్యదర్శిలు నల్లి సతీష్, కల్వల రమేశ్, కార్యనిర్వహణ కార్యదర్శిలు బొట్ల లక్ష్మణ్, కన్నూరి వెంకట్ స్వామి, కార్యవర్గ సభ్యులు అరేపల్లి లావణ్య, కుమ్మరి అంజయ్య, దొంతవల్ల సమ్మయ్య, బోధన, బోధనేతర, సిబ్బంది, హెల్త్ క్యాంప్ టీం లీడర్ డాక్టర్ వంశీకృష్ణ, వాలింటర్లు డాక్టర్స్ చందన, అచ్యుత్, షాబ్నం, జూనియర్ డాక్టర్స్ రమ్య, సుష్మంజలి, శివ చందన, లిఖిత, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.