Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణపుణ్యక్షేత్రాలు

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి

 

గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని బ్రహ్మంగారి గుట్ట పై కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 416వ జయంతిని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, కలశారాధన, వీరబ్రహ్మేంద్రస్వామికి షోడష ఉపచారపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దశాబ్దాలుగా బ్రహ్మంగారి గుట్ట వద్ద గజ్వేల్ ప్రాంత ప్రజలు స్వామివారిని ఆరాధిస్తున్నారని తెలిపారు. కలియుగంలో భవిష్యత్తులో సమాజ పరిస్థితులను, జరగబోయే సంఘటనలను కాలజ్ఞానం ద్వారా వివరించడంతోపాటు సమాజంలోని కులమత బేధాలను నిర్మూలించడంలో వీరబ్రహ్మేంద్రస్వామి ముఖ్యపాత్ర వహించారన్నారు. కలి ప్రభావానికి గురికాకుండా ఉండాలంటే వీరబ్రహ్మేంద్రస్వామి సూచించిన మార్గంలో ప్రజలు నడవాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ పట్టణంతో పాటు, ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Related posts

జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్ 

TNR NEWS

సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

సన్న వడ్లకు బోనస్ పై రైతుల హర్షం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురెందర్ రెడ్డి

TNR NEWS

కొనగట్టు శివాలయంలో రుద్రహోమం

TNR NEWS

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

ప్రతిష్టించిన చోటే గణేష్ ని నిమజ్జనం

TNR NEWS