May 19, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సాయం చేద్దాం.. ప్రాణాలు కాపాడుదాం  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు   ప్రాణాపాయాలతో పోరాడుతున్న వీరమ్మ   సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు

అసలే పేదరికం. అనుకోని రోడ్డు ప్రమాదం పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి రూ.6లక్షల రూపాయలు ఖర్చు చేస్తేనే ప్రాణాలు దక్కే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన జిల్లా వీరమ్మ గ్రామంలోని కూలినాలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. డిసెంబర్ 30వ తేదిన పెద్ద కుమారుడు పిల్లలతో పిల్లలమర్రి నుంచి బైకుపై వస్తుండగా వాహనం అదుపుతప్పి కింద పడింది. దీంతో డివైడర్ కు బలంగా ఢీకొనడంతో ఆమె హెడ్ ఇంజూరైంది. దాంతోపాటు దవడ రెండు వైపులా ఉన్న ఎముకలు విరిగాయి. పొట్టకు బలమైన గాయాలు తగిలాయి. ఆమెను ప్రస్తుతం వెంటిలేషన్ మీదనే వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. వారి వద్ద ఉన్న కొద్దో గొప్పో డబ్బులతో వైద్యం చేయించారు. ప్రస్తుతం వారి వద్ద చిల్లి గవ్వ కూడా లేవు.

*ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు*

6 లక్షలకు పైగా ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. వారిది కూలీనాలీ చేసుకుంటే కడుపు నింపుకునే పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, మానవతావాదులు, యువకులు తమకు తోచిన విధంగా సాయం చేసి ప్రాణాలు కాపాడుటకు దయార్థ హృదయంతో సాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. వీరమ్మ కుమారుడు జిల్లా వీరబాబు ఫోన్ పే నంబర్ (6303328720), బ్యాంకు అకౌంట్ నెంబరు (33333470214) దాతలు సంప్రదించాలని వేడుకుంటున్నారు.

Related posts

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS

టాటా ఏసీఈ వాహనాలలో తరలిస్తున్న గోవులు పట్టివేత

Harish Hs

మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

Harish Hs

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS