వర్గీకరణ అమలుకై మాదిగ ఉద్యోగులందరం ఐక్యంగా ఉండి పోరాడుదామని మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో జిల్లా ఉపాధ్యక్షులు చేకూరి రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ఏ బి సి డి వర్గీకరణ అమలకై పోరాడేందుకు మాదిగ ఉద్యోగులు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.డిసెంబర్ 1న హైదరాబాదులో జరిగే మాదిగ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలు విజయవంతం కావడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొల్లికొండ కోటయ్య, మాది గురవయ్య,ఏపూరి పర్వతాలు, పాతకోట్ల ప్రకాష్,నెమ్మది ఉపేందర్,పిడమర్తి సైదులు, నందిగామ ఆనంద్,దున్న వెంకటేశ్వర్లు,వెంకటరత్నం,సుధాకర్, సునీల్, అక్షపతి,వెంకటేశ్వర్లు, రంగారావు,కిరణ్ కుమార్, బుచ్చారావు,రవి, పులి శ్రీను, ఏపూరి గురుస్వామి తదితరులు పాల్గొన్నారు…………..