Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థులు భోజనం చేసే గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు.శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న కూరగాయలు, బియ్యం, ఇతరత్రా సామాన్లను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పరిశుభ్రమైన త్రాగు నీరు అందించాలని అన్నారు. విద్యార్థులకు వేడివేడి ఆహార పదార్థాలను అందించాలని సూచించారు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని వీటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, పాల్గొన్నారు.

Related posts

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా – వ్యక్తి మృతి

TNR NEWS

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TNR NEWS

బెల్లంకొండ వెంకయ్య చిత్ర పటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS