మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండలం అమ్మాపురం జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యోగ ఇన్స్ట్రక్టర్ లింగాల మురళి కృష్ణ విద్యార్థులకు ధ్యానం నిజజీవితంలో ఏవిదంగా చేయాలో వివరించారు.ధ్యానం చేయడం వలన కలిగే ఉపయోగాలు చెప్పారు. అదేవిధంగా వారిచే ధ్యానం చేయించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రతి రోజు ధ్యానం చేయడం ద్వారా తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యంశాలు చక్కగా అర్ధమవుతాయాన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతు.. విద్యార్థులు విధిగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు.విద్యార్థులు బావి భారత నిర్మాతలు, కాబట్టి కష్ట పడి చదుకోవాలన్నారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

previous post