Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఐదేళ్ళలో కోటిమందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ రామ్మూర్తియాదవ్*… *కాంగ్రెస్ విజయోత్సవ సభకు వరంగల్ తరలిన కాంగ్రెస్ నాయకులు

 

ఐదేళ్లలో కోటి మందిని కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఉండ్రగొండ లక్ష్మి నర్సింహ్మస్వామి దేవస్థాన చైర్మన్ డాక్టర్ రామ్మూర్తియాదవ్ అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్నందున వరంగల్లో మంగళవారం నిర్వహించిన ఇందిర మహిళా శక్తి సభకు సూర్యాపేట నుంచి 2000ల మంది కార్యకర్తలు తరలివెళుతున్న సందర్భంగా వాహనాలకు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజునే మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేసి 105కోట్ల మంది ఉచిత ప్రయాణం చేయగా 7,290బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఉచిత సిలిండర్లను 43మంది లక్షల మంది ఉపయోగించుకోగా 3,500ల కోట్లు కేటాయించామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 3 పరీక్షలను ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. విదేశాల నుంచి 35వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ముక్యమంత్రి రేవంత్రెడ్డి నూతన కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కాలేశ్వరం చుక్క నీరు వాడకుండా ఈ ఏడాది వరి సాగు అధికంగా చేశారని అన్నారు. పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే 72వేల కోట్ల అప్పును కాంగ్రెస్ ప్రబుత్వం ఇప్పటి వరకు తీర్చిందన్నారు. దేశంలో కాంగ్రెస్లో రాహుల్, ప్రియాంక గాంధీ తరువాతి స్థానం రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. చరిత్రలో ఎవరూ చేయలేని కుల గణనను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేస్తున్నారని ఇది పూర్తయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, సీనియర్ నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్, నిమ్మల వెంకన్న, పిల్లల రమేష్ నాయుడు, వల్గాస్ దేవేందర్, పిల్లల రమేషానాయుడు, తండు శ్రీనివాస్ గౌడ్, బైరబోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related posts

భవన నిర్మాణ వ్యర్ధాలతో ప్రజలకు ఇబ్బందులు….

TNR NEWS

తడిసిన ధాన్యం…ఎండలో ఆరబోసిన రైతు 

TNR NEWS

ప్రతీ కార్యకర్త కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న యూత్ నాయకుడు రేవూరి రణధీర్ రెడ్డి

TNR NEWS

లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి టీజీ ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు

Harish Hs

మల్లన్న సన్నిధిలో కార్తీక పున్నమి వేడుకలు

TNR NEWS

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Harish Hs