నడిగూడెం మండలం రత్నవరం గ్రామం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ కూల్చి తన సొంత పొలానికి పాఠశాలలోని బోరుబావికి మోటర్లు బిగించి వాడుకుంటున్న ఘరానా వుదంతమిది. అన్నయ్య దానం, తమ్ముడి దౌర్జన్యం, మిన్న కున్న అధికారుల తీరుకిది నిదర్శనం. రత్నవరం ప్రాథమిక పాఠశాలకు గతంలో కురాకుల రామస్వామి తండ్రి గోపయ్య పేరున పాఠశాల స్థలాన్ని ప్రభుత్వానికి వారి వారసులు పుట్టపాక అలివేణి, విరాళం ఇచ్చారు. అందులో ప్రభుత్వం బోరు వేయగా నేడు దాతల వారసులైన కూరాకుల శ్రీరాములు, రాజుల శ్రీకాంత్ లు పాఠశాల ప్రహరీ గోడను కూల్చి తమ సొంత వ్యవసాయ భూములకు పాఠశాల బోరును, పాఠశాల దారిని ఆక్రమించి యదేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇట్టి విషయమై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.