వికారాబాద్ జిల్లా కేంద్రం లో ఆటో ర్యాలీ లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నేడు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేత్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు వలన నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 50 వేల రూపాయలు ఇవ్వాలి.ఆటో రవణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.ఆటోలకు తడ్ పాటి ఇన్సూరెన్స్ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కల్పించాలి. ఈ యక్సిడెంట్ల సందర్భంగా బీమా 10 లక్షలు సాధారణ మరణానికి వర్తింప చేయాలి. అక్రమంగా నడుపుతున్న ఎల్పిజి సిఎన్జి ఇతర ఆటోలను పర్మినెంట్ నిబంధనలకు అనుగుణంగా వెంటనే నిషేధించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2019 మోటారు వాహనాల చట్టని రద్దు చేయాలి ప్రైవేట్ ఫైనాన్స్ దోపిడిని అరికట్టాలి రాష్ట్రంలో జిల్లాలో ఆటో డ్రైవర్లకు ఆటోలకు క్యాబులకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి అనేక సంవత్సరాలు నుంచి ఆటోలు నడుపుతున్న కార్మికులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆర్టీవో, పోలీసుల వేధింపులు ఆపాలి.తదితర డిమాండ్లపై నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు సుమారు 100 మంది వరకు ర్యాలీలో నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యాదయ్య జంగయ్య ప్రశాంతు నర్సింలు వెంకట్ రఫీ హలీం మహేందర్ అంజయ్య రవి మహేష్ పాండు మల్లేష్ దర్శన్ రాజీవ్ దిన్ ఖాదర్ శ్రీనివాస ప్రశాంత్ ముజఫర్ సుభాష్ శ్రీకాంత్ కలీం రాజు రమేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.