సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం గ్రామం లోని రెండవ వార్డులో మురికి కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు గుండా వెళ్లే బాటసారులకు, వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు సోమవారం క్యూ న్యూస్,శనార్తి పత్రిక ను ఆశ్రయించారు.. వారు తెలిపిన వివరాల ప్రకారం… డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో కొన్ని సంవత్సరాల నుండి ఇంట్లో వాడుతున్న మురికి నీరు రోడ్డుపైకి చేరి, మురికి కాలువలగా రోడ్డు తలపిస్తూ ఉండడం, అలాగే భయంకరమైన దుర్వాసన వెదజల్లుతుండడంతో రెండోవ వార్డులో ఉన్న ప్రజలు వివిధ రోగాల బారిన పడిన అధికారులు గ్రామంలో ఉన్న నాయకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వీధి ప్రజలు ఆగ్రా వ్యక్తం చేశారు. ఎండాకాలం,వానాకాలం, వర్షాకాలం, ఏకాలంలో నైనా ఈ మురికి నీరు ఇలాగే ఉంటాయని సీజనల్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని పేర్కొన్నారు.