కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ *బొల్లం మల్లయ్య యాదవ్* ఆదేశానుసారం BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు *షేక్ నయీమ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రజావ్యతిరేఖ పాలన, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు హర్షించేలా లేవని, తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజించే తెలంగాణ తల్లిని అవమానిస్తూ కొత్తగా మరొక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం యావత్ తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను అవమానించడమేనని షేక్ నయీమ్ దుయ్యబట్టారు. వారు కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహం కాంగ్రెస్ తల్లి విగ్రహమే కాని తెలంగాణ తల్లి విగ్రహం కాదు, ఎప్పటికైనా కన్నతల్లి కన్నతల్లే కాని సవతితల్లి కన్నతల్లి కాదని, కేవలం కేసీఆర్ పై కోపంతో ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఆయన నిర్మించిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయాన్ని కూడా మారుస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను అవమానించేలా ఈ ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలు ఆపకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు…
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, కౌన్సిలర్ మేదర లలిత, పార్టీ సీనియర్ నాయకులు సంగిసెట్టి గోపాల్, కర్ల సుందర్ బాబు, మైనారిటీ నాయకులు షేక్ అబ్బుబకర్, షేక్ ఆరిఫ్, చలిగంటి వెంకట్, కాసాని మల్లయ్యగౌడ్, పట్టణ యువజన సంఘాల అధ్యక్షుడు దొంగరి శ్రీను, జానీఆర్ట్స్, సిద్దెల రాంబాబు, గంధం శ్రీను, గొర్రె రాజేష్,ధీకొండ కృష్ణ, మాదాల ఉపేందర్, షేక్ నిజామ్, షేక్ దస్తగిరి, కలకొండ వెంకటనారాయణ, కుడుముల సైదులు, బొర్ర వంశీ, గొర్రెముచ్చు రవి తదితరులు పాల్గొన్నారు.