కోదాడ: డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజా చైతన్య వేదిక సారధ్యంలో ఎమ్మెస్ జూనియర్ కాలేజీ ఆవరణలో చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వుమ్మడి రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన ప్రొఫెసర్ బాల గోపాల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని మాట్లాడుతూ..
1215 లో ఇంగ్లాండ్ రాజు విడుదల చేసిన మొట్టమొదటి హక్కుల ప్రకటన ‘మాగ్న కార్ట్. దీని ఆధారంగా 1948 డిసెంబర్ 10 న వెలువడినదే ప్రపంచ మానవహక్కుల దినోత్సవం.మాగ్నా కార్తా లోని అంశాలను మన భారత రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది. గౌరవంగా జీవించే హక్కు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు, అంటరానితనాన్ని నిరాకరించే హక్కు, వర్ణ వివక్షత,సమాజంలోని అధిపత్య శక్తుల నుండి రక్షణ, మతస్వేచ్ఛ వంటివే కాకపోతే అనేక అంశాలు పోరుల రక్షణకు రాజ్యాంగం భాద్యత తీసుకొంది. తిలపాపం తల పిరికెడు అన్న చందంగా పాలక వర్గాలు వీటిని సక్రమంగా అమలు పరుచుటలో వైపల్యం చెందుతున్నారు. రాజ్యాంగాన్ని శక్తిహీనంగా చేస్తున్నారు. తమ స్వప్రయోజనాలకై రాజ్యాంగాన్నే మార్చాలనే కుట్రలను పార్లమెంటునే వేదికగా చేసుకోవడం భారతప్రజలకు ద్రోహం చేయడమే. చైతన్యవంతమైన భారత పౌర సమాజం దీన్ని నిరోధించే భాద్యత తీసుకోవడమే నిజమైన దేశభక్తి. ఈకార్యక్రమంలో రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి ,హరికిషన్, రామనరసయ్య ,భిక్షం ,ఉదయగిరి మస్తాన్, వి నరసింహారావు, జిఎల్ఎన్ రెడ్డి, బడుగుల సైదులు ,జాఫర్ బాబు ,భద్రం వీరాంజనేయులు ,బాబు, మల్లిఖార్జున్ , శ్రీనివాసరావు మల్లయ్య పాల్గొన్నారు.