పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో గత మూడు రోజులుగా శ్రీ విరాజ్ హాస్పిటల్, పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ లో డాక్టర్ ఎన్. రాజ్ కుమార్ (బి డి ఎస్, డెంటల్), డాక్టర్ జి. ఆంథోని రెడ్డి, డాక్టర్ నవీన్, లయన్స్ క్లబ్ విజన్ కేర్ నేత్ర వైద్య నిపుణులు పూదరి దత్తా గౌడ్, అబ్దుల్ వాసే లు పాల్గొని విద్యార్థులకు దంత సంబంధిత, నేత్ర సంబంధిత మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత బాధపడే కంటే అసలు సమస్య రాకుండా చూసుకోవడమే అత్యుత్తమమని అన్నారు. అనంతరం పిల్లలకు ఆరోగ్య సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.