మద్దూర్ నవంబర్ 23 ( TNR NEWS ): మండల కేంద్రం లో శనివారం రోజు ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు మాట్లాడుతూ డిసెంబర్ 01 తారీఖున హైదరాబాద్ పరెడ్ గ్రౌండ్ లో జరుగు మాలల సింహ గర్జన బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలు చాలా తక్కువగా ఉన్నారని మందకృష్ణ ప్రచారం చేస్తూ మాలలను దెబ్బతీస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మాలాలు 50 లక్షల జనభా ఉన్నారని అన్నారు. ఏబిసిడి వర్గీకరణ బహిరంగ సభ ద్వారా మెసేజ్ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని అన్నారు. రెండు వర్గాల మధ్య పోరాటం జయపజయాలకు దారితీస్తుంది – ఒకే వర్గం మధ్య పోరాటం, ఆ వర్గ నాశనానికి దారి తీస్తుంది అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. రిజర్వేషన్లు కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధు గ్రామ కన్వీనర్ కనకప్ప, కోకన్వీనర్ రాములు, బ్యాగరికిష్టప్ప, ఎం విజయ్, బ్యాగరీ శీను, తదితరులు పాల్గొన్నారు.