సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు రిమ్మనగూడ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు హైద్రాబాద్ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలో రాగానే గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద అటు వైపు నుండి వస్తున్న కారు ఒక్కసారిగా రోడ్డు దాటే క్రమంలో బస్సు ,కారు డి కొనడం తో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మంది కి తీవ్రగాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్తితి విషమించడం తో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను అంబులెన్స్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి చేరుకొనే సమయం లో శ్రావణి అనే మహిళ (38) మృతి చెందగా మరో 4గురు క్షతగాత్రులను సుధాకర్ (40), గణేష్ (35),సాయి(28), లతిక్(12), చికిత్స అందిస్తున్నారు.వీరు సికింద్రబాద్ లోని దమ్మాయిగూడ నుండి తమ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా లోని మిరుదొడ్డి గ్రామానికి వెళ్లి క్రమం లో ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు అంత ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గజ్వేల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.