Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి  – మంత్రులు కొండ సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి లకు వినతి పత్రం అందించిన నాయకులు

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కొండ సురేఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు హామీ ఇచ్చారు. మంగళవారం మామిడి అలా సర్పంచ్ పచ్చిమడ్ల నాగరాణి శ్రీనివాస్ గౌడ్ , ఎడ్ల బాబు ఇతర నాయకులతో కలిసి సిద్దిపేట జిల్లా మంత్రి కొండ సురేఖకు వినతి పత్రం అందించారు, ములుగు మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగం రాజు యాదవ్ బహిలంపూర్ గ్రామ అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి తదితర నాయకులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ మా గ్రామాల గ్రామ పంచాయితీలను యధావిధిగా కొనసాగించాలని అన్నారు. వ్యవసాయ భూముల కేసులు హైకోర్ట్ లో పెండింగ్ లో ఉండి పై ఉండగా భూములు కొండపోచమ్మ సాగర్ లో ముంచి బలవంతంగా రాత్రి సమయంలో ఇండ్లను కూల్చేసి రేకుల రూమ్ లలో పెట్టి సంవత్సరాలైన నేటికి మా -సమస్యలను తీర్చలేదు. కాబట్టి సమస్యను పరిష్కరించాలన్నారు. పూర్తిగా R&R లు ఇవ్వలేదు కాబట్టి ఇప్పించాలని కోరుతున్నామన్నారు. ఇంక చాల మందికి ప్లాట్లు మరియు ఇండ్లు పూర్తిగా ఇవ్వలేదు. ఒంటరి మహిళల/మగవాళ్లకు వారికి నచ్చిన వారికిచ్చి మిగితా చాలా మందికి ఇవ్వాలని హైకోర్ట్ ఉత్తర్వులున్న ఇవ్వలేదు కాబట్టి ఇప్పించాలని కోరుతున్నాము. 18 సంవత్సరాలు పెళ్ళికానీ యువతి/యువకులకు పూర్తి R&R ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాము. కొర్టులో కేసు వేసిన వారికి కూడా ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇస్తే కనీసం గ్రామంలో ఇచ్చిన మాదిరిగా కూడ ఇవ్వలేదు. ప్యాకేజీలు ఇచ్చిన వారిలో కొందరికీ ఇప్పటి వరకు ప్లాట్లు, కేటాయించలేదు. కొందరికి ప్లాట్లు కిటాయించారు కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. కొందరికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన భౌతికంగా చూపించలేడు, కొందరికి కేటాయించి రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ల స్థలాల్లో భూసేకరణ వివాదాలున్నాయి. ఇప్పటి వరకు పరిస్కరించలేదు కొందరికి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేశారు. గత ప్రభుత్వంలో అక్రమంగా వచ్చి ఇండ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి రిజిస్ట్రేషన్ చేసిన వారికి భౌతికంగా ఇవ్వలేదన్నారు.కొందరికి ఇండ్ల స్టెక్చర్ల పరిహారాలు పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి ఇండ్ల దగ్గర ఉన్న ఇంటి అడుగుస్థలం. పరిహారం ఇవ్వలేదు. కొందరికి ఇండ్ల దగ్గర ఉన్న స్టక్ఫర్ల పరిహారాలు పూర్తిగా ఇవ్వలేదు. కొందరి భూముల పరిహారాలు ఇవ్వలేదు. కోర్టులో ఉన్న కేసుల పరిష్కారణ కొరకు చొరవ చూపలేదు. భూములకు పరిహారాలు ఇచ్చి భూముల వద్ద ఉన్న స్ట్రక్చర్ల పరిహారాలు పూర్తిగా ఇవ్వలేదు. కొన్ని అసైన్డ్ / లావుని పట్టా పట్టా భూముల పరిహారాలు మరియు భూముల వద్ద ఉన్న స్టక్చర్ల పరిహారాలు పూర్తిగా ఇవ్వలేదు. పునరుపాది తీపునిరావాస కల్పనలో భాగంగా కొందరికి R&R చెక్కులు ఇవ్వలేదు. కొన్ని కుటుంబాలను pdf గుర్తించి కూడ వారి పిల్లలకు R&R చెక్కులు ఇవ్వలేదు. కొందరికి ఇండ్ల నిర్మాణానికి ఇచ్చే 5,04,000/- ఇవ్వలేదు. ఇలా ఇవ్వాల్సిన అన్ని చెక్కులను చట్ట ప్రకారం వడ్డీ కలిపి ఇప్పించాలని కోరుతున్నామన్నారు. నేటికి సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వారన్నారు

Related posts

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

*నేటి నుండి సిపిఎం సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభలు….*   *ఏర్పాట్లు పూర్తిచేసిన ఆహ్వాన సంఘం…*   *నేడుబహిరంగ సభ….*   *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాక…* 

TNR NEWS

ప్రజావాణికి 93 దరఖాస్తులు…  ఇంటర్ పరీక్షలకు ఆన్ని ఏర్పాట్లు… జిల్లా కలేక్టర్ తేజస్  సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి….

TNR NEWS

వేడుకల పేరిట డబ్బును వృధా చేయవద్దు

Harish Hs

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

TNR NEWS

వినూత్నంగా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన

Harish Hs