మద్దూర్ నవంబర్ 23 ( TNR NEWS ): మండల జిల్లా పరిషత్ కార్యాలయం లో డేటా ఏంటి నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీవో నర్సింహారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి విద్యా కులగణన ద్వారా సమాచారం ఆన్లైన్ ద్వారా మండలంలోని మీసేవ ఆపరేటర్లు , డిపార్ట్మెంట్ ఆపరేటర్లు, ఇంకా ఇతర ఆపరేటర్లు భాగస్వామ్యంతో నమోదు చేస్తున్నామన్నారు. నమోదు ప్రక్రియలో పాల్గొన్న ఆపరేటర్లకు 25 నుంచి 30 రూపాయలు వరకు ఇస్తామని, డేటా ఎంట్రీ చేయడానికి ఆసక్తిగల వారు మండల ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం ఉంది అన్నారు.