ఎస్సీ వర్గీకరణకై మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ దక్షిణా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెటి లక్ష్మణ్ మాదిగలు అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలో ఈనెల 13 నుంచి కోదాడ నియోజకవర్గంలో మాదిగలను చైతన్యపరిచేందుకు చేపట్టిన బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.వర్గీకరణ చేసిన తర్వాతనేఉద్యోగ నియామకాలు చేపట్టాలనిప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జనవరి 19న జరిగేమాదిగల గర్జన సభకు గ్రామస్థాయి నుండి మాదిగలంతా ఐక్యమై తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ బాణాల అబ్రహం,పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగ, కౌన్సిలర్ గంధం యాదగిరి, కంభంపాటి శ్రీను, గంధం పాండు, రంగయ్య, పిడమర్తి బాబురావు, ఏర్పుల శ్రావణ్,విజయభాస్కర్, ముక్కంటి, వెంకటనారాయణ, కందుకూరి నాగేశ్వరరావు, స్వామి, ప్రసాద్, కొత్తపల్లి నరహరి, పంది వెంకటి,వినయ్, చంటి తదితరులు పాల్గొన్నారు……..
![](https://tnrnews.in/wp-content/uploads/2024/12/IMG-20241218-WA0034-960x638.jpg)