రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న మునగాల మండల ఆటో డ్రైవర్లని స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు, చలో అసెంబ్లీ ముట్టడికి తరలి వెళుతున్న తమను అరెస్టు చేయడం పట్ల స్థానిక ఆటో డ్రైవర్లు తీవ్రంగా ఖండిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు తమ నిరసన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ జానీమియా మాట్లాడుతూ, ఎన్నికల హామీల్లో భాగంగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తం,గాఆటో డ్రైవర్ల మరియు ఓనర్ల రోడ్డున పడ్డారని, ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరకాలం గడుస్తున్న తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్త ఆటో వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న తమను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం కార్మిక ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం అణచివేసే ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు. రోడ్డునబడ్డ ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి 12,000 బకాయి పడ్డ రేవంత్ ప్రభుత్వం తక్షణమే అట్టి నిధులను విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తంగేళ్ల వెంకన్న, లింగయ్య, లాలు, కోటి, మెరిగేకర్ణాకర్, శివయ్య, రాజు, రఫీ, కర్ణాకర్, వీరస్వామి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.