కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని బాలురు ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమాము కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు ఈసందర్భంగా మాట్లాడుతూ.
.అన్ని మతాల సారం ఒకటేనని.. మత విద్వేషాలు విడనాడి తోటి వారితో సోదర భావంతో మెలుగుతూ.. క్రీస్తు మార్గంలో పయనించాలి… తోటి వారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశం అన్నారు. క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు.
క్రైస్తవం అనేది ఒక మతం కాదు.. అదొక జీవన విధానం.. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ,సహకారాలు అందిస్తామన్న వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐ పాస్టర్ రేవా యన్.పాల్, ముస్లిం మతపెద్ద హామీద్ మౌలానా, జర్నలిస్టులు గాంధీ, పూర్ణ, వెంకటనారాయణ, లక్ష్మణ్, నాగరాజు, మైముద్, నజీర్,నరేష్, వీరబాబు, రామకృష్ణ, రహీం, శ్రీహరి, పవన్, భాస్కర్, సైదులు, నాగేంద్రబాబు రామకృష్ణ నాయకులు పందితిరపయ్య శ్రీకాంత్, రహీం, నజీర్, తదితరులు పాల్గొన్నారు.