కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం క్లబ్ ఆడిటోరియంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారి ఎస్ ఆర్ కె మూర్తి సమక్షంలో సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా పాత కమిటీ నే కొనసాగిస్తూ తీర్మానించారు. అధ్యక్షులుగా గాయం. పట్టాభి రెడ్డి, ఉపాధ్యక్షులు వేనేపల్లి. సత్యనారాయణ, కార్యదర్శి బొల్లు. రాంబాబు, జాయింట్ కార్యదర్శి చింతలపాటి. శేఖర్, కార్యవర్గ సభ్యులుగా ఓరుగంటి. రవి, గుండపునేని. వేణుగోపాలరావు, గుడిబండ్ల రాజన్, కారుమంచి. సత్యనారాయణ, పాశం నాగిరెడ్డి, పసుపులేటి నాగేశ్వరరావు, నర్రా వంశీకృష్ణ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పలువురు సీనియర్ క్లబ్ సభ్యులు నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కోదాడ పబ్లిక్ క్లబ్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, భారత్ రెడ్డి తదితరులు అభినందించారు…….