తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా కోదాడ పట్టణానికి చెందిన కొంగర నరసింహారావు నియామకం అయ్యారు. ఆదివారం హైదరాబాదులో జరిగిన ఆ సంఘ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు కోదాడ నియోజకవర్గానికి చెందిన మరి కొందరికి జిల్లా కార్యవర్గంలో చోటు దక్కింది. జిల్లా ప్రచార కార్యదర్శిగా గొర్రె రాజేష్, కార్యదర్శిగా పిచికల కోటయ్య, చిట్టిప్రోలు కనకయ్య, నక్క చంద్రశేఖర్ లు జిల్లా కార్యవర్గంలో నియామకం అయ్యారు. ఈ సందర్భంగా వీరిని రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు నక్క చంద్రం, అనబత్తుల వేణు, కోట నాగభూషణం, రెబ్బ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు……..