నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని మునగాల ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ మండల ప్రజలను కోరారు.నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని ఎస్.ఐ విజ్ఞప్తి చేశారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ర్యాష్ బైక్ డ్రైవింగ్,త్రిబుల్ రైడింగ్ చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం,రాకపోకలకు అంతరాయం కలిగించడం,డీజే స్పీకర్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం, రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగడం, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్), గంజాయి సేవించడం వంటి అసాంఘిక పనులకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి తమ సిబ్బందిని అన్ని ప్రదేశాల్లో నిఘా ఉంచి పర్యవేక్షిస్తామని ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్.ఐ వెల్లడించారు. మునగాల మండల ప్రజలకు ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ ముందస్తుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
