Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే 

కె. ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో మహిళల అభ్యున్నతి కోసం, విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డిగారి అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి, తెలుగు లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు వ్యవహరించారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించిన అనంతరం ప్రిన్సిపాల్ ఎన్ .రమణారెడ్డి మాట్లాడుతూ… కుల,మత బేధాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన చదువుల సరస్వతి సావిత్రిబాయి అని, విద్య ద్వారానే స్త్రీలకు జ్ఞానం, సామాజిక స్పృహ కలుగుతుందని, అందుకే స్త్రీలందరూ చదువుకోవాలని పిలుపునిచ్చి, తానే స్వయంగా పాఠాలు చెబుతూ, దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల హక్కుల కోసం పోరాడడం తన సామాజిక బాధ్యత అని నమ్మి,తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిందన్నారు. తన రచనలతో సమాజాన్ని చైతన్యం చేసి, స్త్రీలలో చదువు పట్ల ఆకాంక్షను రగుల్కొల్పింది. ఆవిడ ధైర్యాన్ని ప్రతి బాలిక కలిగి ఉండాలని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతర పఠనం అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.లక్ష్మయ్య, ఆర్.పిచ్చిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు,

జి.యాదగిరి,వి. బల భీమారావు, జి.నాగరాజు, పి.రాజేష్, ఎం.రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి. వెంకన్న, పి.తిరుమల,యస్.గోపికృష్ణ, ఎం .చంద్రశేఖర్, ఇ.నరసింహారెడ్డి,యస్. కె.ముస్తఫా, ఇ . సైదులు, యస్.కె.ఆరీఫ్,యన్.రాంబాబు, కె.శాంతయ్య, ఆర్. చంద్రశేఖర్, యస్.వెంకటాచారి,జ్యోతి, డి.ఎస్ .రావులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

దహన సంస్కారాలకు సహకారం పుణ్యకార్యం

Harish Hs

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

TNR NEWS

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం

Harish Hs

కార్యదర్శులు అప్పులపాలు..!!

TNR NEWS

బెల్లం చాయ్ తాగి చూడు బాయ్ –కోదాడలో క్యూ కడుతున్న చాయ్ ప్రియులు.  — ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.  — స్వయం ఉపాధి వైపు ఇరువురి సోదరులు అడుగులు  — బెల్లం టీ స్టాల్ తో లభిస్తున్న ఆదాయం  — నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువకులు….

TNR NEWS

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs