వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివారు పెద్ద తండా కు చెందిన అజ్మీర వసంత, వయస్సు 32,సం ప్రైవేట్ జాబ్ చేస్తున్నది .వసంత కు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఏ సంబంధం కూడా కుదరకపోవడంతో తన చెల్లెలి ఇద్దరికీ పెళ్లి అయిపొగ తనకు పెళ్లి కావడం లేదని మనస్థాపం చెంది తేదీ 03.01.2025 రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో పురుగుల మందు తాగడం తో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది . వసంత అన్న అయిన అజ్మీర రమేష్ ఫిర్యాదు ఇవ్వగా నల్లబెల్లి ఎస్ఐ కేసు నమోదు చేశారు.