వేసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం కోదాడ పట్టణంలో ఆర్డీవో సూర్యనారాయణ ను రైతులతో కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలైన కోదాడ, కొమరబండ, తమ్మర, గుడిబండ,తొగర్రాయి, గణపవరం, కూచిపూడి గ్రామాలలో కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 2 కోట్ల 25 లక్షల రూపాయలు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని కొనుగోళ్లు పూర్తయి 20 రోజులు కావస్తున్న నేటి వరకు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాలేదు అన్నారు. వానాకాలం సీజన్ లో కూడా రైతు భరోసా రాని రైతులు ఉన్నారని ఇప్పటివరకు మూడున్నర ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారని రైతులందరికీ బోనస్ తో పాటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కనగాల కొండయ్య, మునగా రాంప్రసాద్, కొండ సురేష్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు………