సూర్యాపేట రూరల్ : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పట్టణ, పరిసర గ్రామ భక్తులు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎరకేశ్వర, నామేశ్వర స్వామికి రుద్రాభిషేకాలు నిర్వహించి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాల్లో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, దేవాలయ కమిటీ చైర్మన్ కోట్ల సైదులు, కార్యక్రమ సహకార దాత చేపూరి వేణుగోపాలరావు, భక్తులు అబ్బూరి వినోద్, కోట సతీష్, భక్తులు పాల్గొన్నారు.