కోదాడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేషన్ నుండి వచ్చిన నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ లో కోదాడ డివిజన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఏపూరి సత్యరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమంలో ఎల్లవేళలా ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ మండల అధ్యక్షులు బండ్ల దాసు, మునగాల అధ్యక్షులు నవీన్, కోదాడ ఉపాధ్యక్షులు జవ్వాజీ ప్రవీణ్ చౌదరి, సోమపొంగు గోపి, సాయి కిరణ్, శ్రీకాంత్ నరేష్ సట్టు సాయి వంశీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు……….